నారీ నారీ నడుమ మురారిగా శర్వానంద్.!
- January 30, 2024
యంగ్ హీరో శర్వానంద్ పేరు ఈ మధ్య అస్సలు సోదిలో లేకుండా పోయింది. ఆ మధ్య పెళ్లి కార్యక్రమాలతో ట్రెండింగ్ అయిన శర్వానంద్, పెళ్లి తర్వాత బొత్తిగా మాటల్లో లేకుండా పోయాడు.
వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కాబోలు. మళ్లీ ఇప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడో రెండు ప్రాజెక్టులు శర్వానంద్ ఓకే చేసి పెట్టాడు. అందులో ఒకటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖాతాలోనూ ఇంకోటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారి ఖాతాలో ఒకటి.
తాజాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందబోయే సినిమాకి సంబంధించి అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారట.
వాళ్లెవరో కాదు, గుడ్ లక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్తా మీనన్ ఒకరు కాగా, డెబ్యూ మూవీ ఫెయిల్యూర్ అయినా హీరోయిన్గా మంచి పేరు దక్కించుకున్న సాక్షి వైద్య ఇంకోకరు.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో శర్వానంద్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి సిద్ధమవుతున్నాడట. అయితే, ఈ సినిమా కథా, కమామిషు గట్రా పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఏది ఏమైతేనేం, మొత్తానికి శర్వా అయితే ఆన్‌లోకి వచ్చేశాడు. చూడాలి మరి, ఎలాంటి కొత్త కాన్పెప్లులతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







