ఫైనల్లీ.! ‘ఓజీ’ రిలీజ్ ఫిక్స్ చేశారుగా.!
- January 30, 2024
పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల్లో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోన్న సినిమా ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రియాంక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ ఈ మధ్య ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని తేలుస్తూ.. చిత్ర యూనిట్ అందరికీ షాకిచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అలాగే, ‘ఓజీ’ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్లు హింట్ ఇచ్చారు.
ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’ త్వరలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోనుందట. అంతే కాదు, పవన్ కళ్యాణ్‌ని షూట్‌లో పాల్గొనేందుకు సుజిత్ అండ్ టీమ్ ఒప్పించినట్లు తెలుస్తోంది. దాంతో ‘ఓజీ’ టీమ్ యాక్టివ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ కేవలం 15 రోజుల డేట్స్ కేటాయిస్తే.. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు. సో, డేట్స్ విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనేమో.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







