‘భక్త కన్నప్ప’ తాజా అప్డేట్.!
- January 30, 2024
మంచు ఫ్యామిలీకి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. అయినా కానీ, తగ్గేదేలే అంటూ ఓ సరికొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు మంచు వారి అబ్బాయ్ విష్ణు వర్ధన్ ‘భక్త కన్నప్ప’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టును ప్యాన్ ఇండియా వైజ్ భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాలో ప్రబాస్, నయనతార వంటి స్టార్స్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శివుడి పాత్రలో ప్రబాస్ కనిపించబోతున్నాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. పార్వతిగా నయనతార కనిపించబోతోందట. కాగా, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా చేయబోయే షెడ్యూల్లోనే ప్రబాస్ పాత్ర వుండబోతోందనీ, ఓ పవర్ ఫుల్ సన్నివేశాన్నీ అందుకోసం సిద్ధం చేశారనీ తెలుస్తోంది.
అలాగే ఈ ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్లాక్‌లో రానుందట. అందుకోసం ఓ భారీ సెట్ సిద్ధం చేశారనీ తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు ఈ సినిమాని టేకప్ చేశాడు. చూడాలి మరి, ఈ ప్రతిష్టాత్మక చిత్రమైనా మంచు విష్ణు కెరీర్‌ని టర్న్ చేస్తుందో లేదో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







