పుష్ప 2 ఆ బెడదను తట్టుకొనేదెలా.?
- January 30, 2024
టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో ఏ చిన్న విషయాన్ని గోప్యంగా వుంచడం సాధ్యం కావట్లేదు. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి.
షూటింగుల్లో లీకులు.. మేకర్లను బాగా వేధిస్తున్న సమస్య. స్టార్ హీరోల సినిమాలు సైతం చాలా ఈజీగా లీక్ అయిపోతున్నాయ్ ఆన్ స్పాట్ లొకేషన్ల నుంచి. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ కూడా ఇదే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది.
గతంలోనూ కొన్ని స్లిల్స్ అధికారికంగా రిలీజ్ చేయకుండానే లీకైపోయాయ్. తాజాగా మరోసారి. అయితే, చిత్ర యూనిట్ వెంటనే అప్రమత్తం కావడంతో ఆ లీకుల్ని అడ్డుకోగలిగారనుకోండి ఇప్పటికైతే.
త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. నల్లమల అడవుల్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం సుకుమార్ అండ్ టీమ్ కసరత్లులు మొదలు పెట్టింది.
మొదటి పార్ట్‌ని మించి, అత్యంత ఆసక్తికరంగా ఈ సినిమా తీర్చిదిద్దుతుండడంతో ప్రేక్షకుల్లో ‘పుష్ప 2’ ఆసక్తిని పెంచుతోంది. అలాగే, మొదటి పార్ట్‌లో వున్న కీలక పాత్రధారులతో పాటూ, మరికొంతమంది పాపులర్ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







