బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్ భగ్నం.. Dh800,000 విలువైన ఆభరణాలు స్వాధీనం
- January 31, 2024
యూఏఈ: షార్జా పోలీసులు 800,000 దిర్హామ్‌ల విలువైన ఆభరణాలతో కూడిన భారీ బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌ను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖోర్ఫక్కన్లోని ఓ దుకాణంలో అర్థరాత్రి నగలు దోచుకెళ్లారు. షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కి సమాచారం అందింది. వెంటనే నేరం జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గంటలపాటు విచారణ జరిపిన బృందం దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను గుర్తించారు. దొంగిలించబడిన నగలను కూడా ఓడరేవులో షిప్పింగ్ కంటైనర్‌లో పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం దేశం నుండి రవాణా చేయడానికి అది సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసును ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. వాణిజ్య సంస్థల యజమానులు తమ దుకాణాలకు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని. షార్జా పోలీసులు పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనలను నివేదించడానికి ఎమర్జెన్సీ నంబర్ 999ని ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







