సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం..
- January 31, 2024
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ సిటీలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పరిణామాలపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడం, మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్టేషన్ నుంచి సమాచారం లీకవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఒకే పోలీస్‌స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి అని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







