అబుధాబిలో కొత్త హిందూ దేవాలయాన్ని సందర్శించిన 42 దేశాల దౌత్యవేత్తలు
- January 31, 2024
యూఏఈ: 42 దేశాల నుండి రాయబారులు మరియు దౌత్యవేత్తలు BAPS హిందూ మందిర్‌ను సందర్శించారు. మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ రాతి దేవాలయం పురోగతిని ప్రత్యక్షంగా తిలకించి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేవారు.యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆహ్వానం మేరకు వారు ఆలయాన్ని సందర్శించారు.ఆలయం నిర్మాణం తుది దశకు చేరుకుందని ఫిబ్రవరి 14 న మహంత్ స్వామి మహారాజ్, భారత ప్రధాని నరేంద్ర మోదీచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సుధీర్ తెలిపారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న రాయబారులు మరియు దౌత్యవేత్తలకు పూలమాలలతో స్వాగతం పలికారు. BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ అధిపతి పూజ్య స్వామి బ్రహ్మవిహారిదాస్ మాట్లాడుతూ.. ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ ప్రక్రియ మరియు ప్రపంచ ప్రభావాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన యూఏఈ -భారతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం వ్యక్తులకు ప్రేమ, సామరస్యం మరియు సహనం గురించి బోధించే స్ఫూర్తిదాయకమైన భవనం అని నేపాల్ రాయబారి తేజ్ బహదూర్ ఛెత్రి కొనియాడారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో అర్జెంటీనా, అర్మేనియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బోస్నియా మరియు హెర్జెగోవినా, కెనడా, చాడ్, చిలీ, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, ఈయూ, ఫిజీ, గాంబియా, జర్మనీ, ఘనా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, మోల్డోవా, మాంటెనెగ్రో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, నైజీరియా, పనామా, ఫిలిప్పీన్స్, పోలాండ్, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, స్వీడన్, సిరియా, థాయిలాండ్, యూఏఈ, యుకె, యూఎస్, జింబాబ్వే మరియు జాంబియా నుండి వచ్చిన రాయబారులు ఉన్నారు. వీరితోపాటు సీనియర్ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







