‘భైరవకోన’లో ‘ఈగల్’ లొల్లి.!
- January 31, 2024
సందీప్ కిషన్ తాజా సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ మధ్య టాలీవుడ్లో సినిమాల రిలీజ్‌ల విషయంలో ఏదో ఒక లొల్లి జరుగుతూనే వుంది. సంక్రాంతి సినిమాల రిలీజుల విషయంలో నిర్మాతల మధ్య రక రకాల మంతనాలు జరిగాయ్.
ఆ క్రమంలో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు నిరంతర పోరాటం సలిపి ఎలాగోలా రిలీజ్ రేస్‌లో నిలబడిన సంగతి తెలిసిందే.
అలా సంక్రాంతి రేస్ నుంచి పక్కకు తప్పుకున్న సినిమాలో మాస్ రాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా ఒకటి. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ ఇప్పించే ఒప్పందంపై ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఆగింది.
ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే, అనూహ్యంగా అంతకు ముందే రిలీజ్ ప్లాన్ చేసుకున్న సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ కూడా అదే స్లాట్‌లో వుండడంతో.. మల్లీ లొల్లి మొదటికొచ్చింది.
దాంతో, అప్పుడు ‘ఈగల్’ టీమ్కిచ్చిన ఒప్పందం నెరవేర్చడం కోసం ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాతలు ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆల్రెడీ రెండు సార్లు పోస్ట్‌పోన్ చేసుకున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది తాజాగా.
ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విషయమున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్.. సందీప్ కిషన్‌కి జోడీగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







