#RC16 అప్‌డేట్ వచ్చేదెప్పుడంటే.!
- January 31, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పాటూ, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతోనూ ఓ ప్రాజెక్ట్ ఓకే చేసి పెట్టిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ‘గేమ్ ఛేంజర్’ కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. శంకర్ సినిమా కాబట్టి ఈ సినిమా తెరకెక్కడానికి టైమ్ ఎక్కువే పడుతుంది. పడుతోంది కూడా.
అన్నీ కలిసొస్తే.. సెప్టంబర్‌లో ‘గేమ్ ఛేంజర్’ వచ్చే అవకాశాలున్నాయ్. ఆ సంగతి అటుంచితే, బుచ్చిబాబు సన ప్రాజెక్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందట. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఉత్తరాంధ్ర యాసలో ఈ సినిమాలో రామ్ చరణ్ డైలాుగులండబోతున్నాయట.
అంతేకాదు, ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రకి మించిన మేకోవర్‌తో చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చిలో ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకు బుచ్చిబాబు అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. చూడాలి మరి, రామ్ చరణ్ న్యూ లుక్స్ ఎలా వుండబోతున్నాయో.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







