‘జై హనుమాన్’ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంచనాలు అదుర్స్.!
- January 31, 2024
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. టాలీవుడ్‌లోనే కాదు.. ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్యాన్ ఇండియా స్థాయిలో పాపులర్ కాబోతోంది.
ఆల్రెడీ ఆ స్థాయి గుర్తింపు దక్కించేసుకుంది ‘హనుమాన్’ సినిమాతో. ఇక, ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’తో ఆ స్థాయిని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్ర స్టార్ హీరో చేస్తాడు.. అని ప్రశాంత్ వర్మ ప్రకటించినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్.
ఆ స్టార్ హీరో ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది అంతటా. ఆ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవే అంటున్నారు. ప్రశాంత్ వర్మ దృష్టిలోనూ మెగాస్టార్ చిరంజీవే మెదులుతున్నారట.
అయితే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, తాజాగా మరో ముచ్చట తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో రాముడి ప్రస్థావన కూడా వుండబోతోందనీ ‘హనుమాన్’ సినిమా చివరిలో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. సో, ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చూపించాల్సిందే.
మరి, ఆ పాత్రలో కనిపించబోయేదెవరంటే.. మహేష్ బాబు అట. ఆ మాట కూడా ప్రశాంత్ వర్మ రీసెంట్ేగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసేశారు. అంటే, ప్రశాంత్ వర్మ స్కెచ్ మామూలుగా లేదు. ఏకంగా సూపర్ స్టార్‌నీ, మెగాస్టార్‌నీ కూడా తన సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఆహ్వానించేయబోతున్నాడన్నమాట. చూస్తుంటే.. ‘జై హనుమాన్’ ఆషా మాషీ మూవీ అయ్యేలా లేదు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







