నిజమైన స్నేహం
- June 29, 2015
ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక పిచ్చుక ఉండేది. పిచ్చుక అంటేనే అందమైన గూడు గుర్తొస్తుంది. అలాగే ఈ పిచ్చుక కూడా అడవిలోని అనేక రకాల పుల్లలు, ఆకులు ఏరి తెచ్చుకుని అందంగా తన గూడును నిర్మించుకుంది. అదే చెట్టు కింద ఒక ఎలుక కూడా చిన్న పొదలో తిరుగుతూ ఉండేది. అయితే ఆ ఎలుకకు కూడా పిచ్చుకని చూసి అందంగా తనకి వీలైనట్లు ఒక గుంతని తవ్వాలని అనిపించింది. అదే తడవుగా గుంతని తవ్వడం మొదలుపెట్టి అందమైన తొర్రను తన నివాసంగా చేసుకుంది. ఇలా ఆ చెట్టు మీదున్న ఆ పిచ్చుక, చెట్టు కింద తొర్రలో ఉన్న ఎలుక మంచి స్నేహితులయ్యాయి. ప్రతిరోజూ తమ తమ గూటి నుండి బయటికి వచ్చి కాసేపు తమ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు పిచ్చుక గూటి నుండి బయటికి వచ్చి చూడగా, కింద ఎలుక తొర్ర దగ్గర ఒక నక్క కాచుకుని కూర్చొని ఉండడం అది గమనించింది. ఆ ఎలుక తొర్ర నుండి వస్తే దాన్ని తినేద్దామని దాని ఆలోచన ఆకలిగా ఎదురు చూస్తుంది. దీన్ని గమనించిన పిచ్చుక ఎలాగైనా తన స్నేహితున్ని రక్షించుకోవాలని తలచి అడవిలోకి పోయి తన తోటి పక్షులనన్నింటికీ ఈ విషయాన్ని, తన స్నేహాన్ని గురించి చెప్పి, వాటి సాయం అడిగింది. అందుకు అవన్నీ అంగీకరించి పిచ్చుక వెంట పెద్దగా అరుచుకుంటూ సాయం వచ్చాయి. ఆ అరుపులకు నక్క, ఏదో పెద్ద జంతువేదో అటు వైపుగా వస్తుందని భావించి, భయంతో ఒక్క ఉదుటున కాళ్లకు పని చెప్పి పరుగు లంఘించింది. ఇంతలో తొర్రలోపల మంచిగా నిద్రపోతున్న ఎలుక బయటికి వచ్చి ఏం జరిగిందని పిచ్చుకని అడగ్గా..పిచ్చుక జరిగింది చెప్పింది. దాంతో ఎంతో సంతోషించిన ఎలుక, పిచ్చుకకు కృతజ్ఞత చెప్పింది. దాంతో వారి స్నేహం మరింత బలపడి, ఆ అడవిలోని జంతువులన్నింటికీ ఎంతో ఆదర్శం అయ్యింది.
నీతి : నిజమైన స్నేహం దేన్నయినా సాధించగలదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







