అబుదాబి - అల్ ధన్నా మధ్య ట్రైన్ సర్వీస్ ప్రారంభం!
- February 01, 2024
యూఏఈ: అబుధాబి నగరం, అల్ ధన్నా ప్రాంతం మధ్య రైలు ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌తో పాటు పరిశ్రమ - టెక్నాలజీ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ ప్రారంభ ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. గత ఏడాది నవంబరులో ఎతిహాద్ రైల్ , అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) అబుదాబి - అల్ ధాఫ్రాలోని అల్ ధన్నా మధ్య రైలు సేవలను ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేశాయి. అబుదాబికి పశ్చిమాన 250కిమీ దూరంలో ఉన్న అల్ ధన్నాలో 29వేల మంది నివసిస్తున్నారు. తాజా రైలు మార్గం ద్వారా అడ్నాక్ ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది. ఎతిహాద్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. 4 బోగీల ప్యాసింజర్ రైలులో మంత్రి, ఉన్నతాధికారులు ప్రయాణించారు. రైలు ప్యాసింజర్ సేవలు అల్ సిలా నుండి ఫుజైరా వరకు 11 నగరాలను కలుపుతాయి. రైళ్లు 200kmph వేగంతో నడుస్తాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే ఇవి ప్రయాణ సమయాన్ని 30-40 శాతం తగ్గిస్తాయి. ప్రయోగ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. కానీ 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







