నితిన్‌కి పవన్ టైటిల్ అయినా కలిసొస్తుందా.?
- February 01, 2024
పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్‌కి చాలా చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తన సినిమాల్లో ఎక్కడో చోట ఇరికించేస్తుంటాడు నితిన్. చాలా సందర్భాల్లో ఆయనకు అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటానని నితిన్ ఓపెన్‌గా చెప్పడం విన్నాం కూడా.
అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తూ.. ఆయన సినిమా టైటిల్‌ని తన సినిమాకి పెట్టేసుకున్నాడు నితిన్. గతంలోనే ఈ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే నితిన్ బిజీగా వున్నాడు.
ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముుదుకొచ్చాడు నితిన్. ధియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందింది.
ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు నితిన్. అందుకే ఇప్పుడు ఎలాగైనా తన అభిమాన హీరో సినిమా టైటిల్‌తో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడట. అందుకే ‘తమ్ముడు’ సినిమా విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట.
వేణు శ్రీరామ్ విషయమున్న డైరెక్టరే. అయితే, ఆయన ట్రాక్ రికార్డ్ ఏమంత బాగా లేదు. లక్కు కలిసొచ్చి.. ‘తమ్ముడు’ హిట్టయితే.. ఇటు వేణు శ్రీరామ్‌కీ, అటు నితిన్‌కీ ఇద్దరికీ మంచిదే.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







