బీట్ రూట్ జ్యూజ్‌తో ఇన్ని లాభాలా.?

- February 01, 2024 , by Maagulf
బీట్ రూట్ జ్యూజ్‌తో ఇన్ని లాభాలా.?

బీట్ రూట్ తింటే రక్తం పడుతుందని చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. అవును మరి, బీట్ రూట్ రంగే రక్తం రంగులో వుంటుంది. అయినా ఇదేమీ తీసిపాడేసే మాట కాదు.
నిజంగానే రక్త హీనత వున్నవారికి బీట్ రూట్ తినమని వైద్యులు సూచిస్తారు. బీట్‌రూట్‌లో వుండే పోషకాలు అలాంటివి మరి.

ఫైబర్‌తో పాటూ, ప్రొటీన్లు, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయ్ బీట్‌రూట్‌లో. ముఖ్యంగా బీట్‌రూట్‌లో వుండే పొటాషియం బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది.

తద్వారా బరువు తగ్గడం అనే ప్రక్రియ చాలా ఈజీగా జరుగుతుంది బీట్‌రూట్‌ని రెగ్యులర్‌గా తీసుకునేవారిలో. అంతేకాదు, గర్భిణీ స్త్రీలు బీట్ ‌రూట్ తీసుకుంటే ట్యాబ్లెట్ల రూపంలో తీసుకునే ఫోలిక్ యాసిడ్ సహజ సిద్ధంగా శరీరానికి అందుతుంది.

తద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుంటుంది. అంతేకాదు, బీట్‌రూట్ జ్యూస్ ఉదయం పూట తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా వుంటారట. రక్త హీనత కారణంగా నీరసంతో బాధపడేవారు ఖచ్చితంగా బీట్ రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హై బీపీ వున్నవారికి బీట్‌రూట్ ఓ దివ్యౌషధంగా చెబుతున్నారు. హై బీపీ కంట్రోల్‌లో వుండడంతో పాటూ, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

లివర్ సమస్యలతో బాధపడేవారు సైతం రెగ్యులర్‌గా బీట్‌రూట్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com