ఎమిరాటీస్ కోసం £10లకే బ్రిటన్ వీసాలు

- February 03, 2024 , by Maagulf
ఎమిరాటీస్ కోసం £10లకే బ్రిటన్ వీసాలు

యూఏఈ: ఎమిరాటీ పౌరులు యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రయాణించడానికి ఎలక్ట్రానిక్ ట్రావెల్ పర్మిట్‌ను ఇప్పుడు పొందవచ్చు. ముందస్తు ప్రవేశ వీసా పొందడం నుండి మినహాయింపు ఉంటుందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూఏఈ రాయబార కార్యాలయం ప్రకటించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూఏఈ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. యూఏఈ పౌరుల కోసం బ్రిటిష్ అధికారులు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (EtA) ప్రోగ్రామ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ను సందర్శించాలనుకునే వారి కోసం ఫిబ్రవరి 1 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.  ఎలక్ట్రానిక్ ట్రావెల్ పర్మిట్ పొందేందుకు అర్హులైన వ్యక్తులు ఫిబ్రవరి 20 నుంచి ప్రయాణించవచ్చని పేర్కొంది.  వారి ప్రయాణానికి ముందు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎలాంటి రెసిడెన్సీని పొందని సందర్శకులు దీనికి అర్హులు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు వచ్చే సందర్శకులు గరిష్టంగా 6 నెలల వరకు సందర్శించే అవకాశం ఉంది.  క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ వీసాపై 3 నెలల వరకు యూకేకి వచ్చే సందర్శకులకు వర్తిస్తుంది. యూకే గుండా ప్రయాణించే సందర్శకులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తు రుసుము 10 బ్రిటిష్ పౌండ్లుగా నిర్ణయించారు. 3 పని రోజులలో దరఖాస్తు ప్రక్రియను పూర్తి అవుతుంది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) యునైటెడ్ కింగ్‌డమ్‌కు రెండు సంవత్సరాల వ్యవధిలో లేదా పాస్‌పోర్ట్ గడువు ముగిసే వరకు అపరిమిత ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది. దరఖాస్తును UK ETA అప్లికేషన్ ద్వారా లేదా GOV.UKలో సమర్పించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com