జెబెల్ జైస్‌లో 3.4°C.. యూఏఈలో పెరిగిన చలి తీవ్రత
- February 04, 2024
యూఏఈ: జెబెల్ జైస్ పర్వతం ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దేశంలోని ఉత్తర దిశలో ఆదివారం నమోదైన 3.4°C ఉష్ణోగ్రత రికార్డు అయిందని, రస్ అల్ ఖైమాలోని నివాసితులకు ఎడారిలో శీతాకాలపు చల్లదనం వచ్చేసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ వద్ద శనివారం ఉదయం 5 గంటలకు (ఫిబ్రవరి 3) మంచుతో నిండిన 4.2ºC నమోదైంది. జనవరి 10న రక్నాలో అల్ ఐన్ వద్ద 5.3ºC రికార్డు అయింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM)E ప్రకారం.. అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్ - ఏడు ఎమిరేట్స్‌లో ఆరింటిలో వర్షాలు నమోదయ్యాయి. ఖోర్ ఫక్కన్ లోనూ వర్షం నమోదైంది. ఫిబ్రవరి అంతటా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్త ఇబ్రహీం అల్-జర్వాన్ తెలిపారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) నిపుణుల ప్రకారం.. యూఏఈలో గత సంవత్సరాలతో పోలిస్తే ఇటీవల చలికాలం తక్కువగా ఉంది. గత సంవత్సరాల కంటే తక్కువ వర్షపాతంతో పాటు డిసెంబర్లో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







