ఇండియా-ఒమన్ చారిత్రక సంబంధాలపై లెక్చర్ సిరీస్
- February 06, 2024
మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ఎంబసీ హాల్‌లో “ఫ్రం మాండ్వీ టు మస్కట్: ఇండియన్ కమ్యూనిటీ అండ్ ది షేర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఒమన్” సిరీస్‌లో మూడవ లెక్చర్ నిర్వహించింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ “మాండ్వీ టు మస్కట్: ఐదు వేల సంవత్సరాల మార్పిడి” పై ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలు, పురాతన సముద్ర సంబంధాలు, నౌకానిర్మాణ సంప్రదాయాలు, వాణిజ్యాన్ని చక్కగా వివరించారు. సన్యాల్ క్రీ.శ. 4వ-5వ శతాబ్దపు కాన్సెప్ట్ ఆధారంగా ఒక పురాతన ఓడను పునర్నిర్మించే భారత ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్‌పై వివరాలను వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలో మాండ్వి నుండి మస్కట్ వరకు ఓడలో ప్రయాణించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ, భారతీయ సంతతికి చెందిన ఒమానీలు, విశిష్ట అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. షా నాగర్‌దాస్ కుటుంబానికి చెందిన పరేష్ షా భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలకు వారి సహకారాన్ని నొక్కి చెబుతూ తన కుటుంబ చరిత్రను వివరించారు. ముగింపులో ఒమన్ బుక్ లవర్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు అనీషా పర్జిత్ నిర్వహించిన కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







