నితిన్ డబుల్ ధమాకా.!
- February 06, 2024
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన హీరో నితిన్ ఇప్పుడు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. రెండు సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు.
అందులో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ కాగా, ఇంకోటి ‘రాబిన్‌హుడ్’. ‘భీష్మ’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ‘రాబిన్‌హుడ్’ సినిమా షూటింగ్‌లోనే నితిన్ బిజీగా వున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది. ఇది పూర్తి కాగానే మరికొన్ని రోజుల్లోనే ఇదే నెల రెండో వారంలో మారేడుమిల్లిలో జిరిగే ‘తమ్ముడు’ షూటింగ్‌కీ హాజరు కానున్నాడట నితిన్.
నితిన్ స్పీడు చూస్తుంటే.. ఈ రెండు సినిమాల్నీ ఏకకాలంలో పూర్తి చేసేసేలానే వున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులు కాదు కానీ, కమర్షియల్ ఎంటర్టైనర్లలా ఈ రెండు సినిమాలూ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలోనే ఈ రెండింటిలోనూ ఏదో ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నితిన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ‘తమ్ముడు’ సినిమా కోసం సీనియర్ నటి లయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.
నితిన్‌కి అక్క పాత్రలో ఈ సినిమాలో లయ కనిపించబోతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







