ఫ్యూయల్ ధరల్ని పెంచిన ఒమాన్

- June 01, 2016 , by Maagulf
ఫ్యూయల్ ధరల్ని పెంచిన ఒమాన్



ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ జూన్‌ నెలకుగాను పెట్రోధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సూపర్‌ గ్రేడ్‌ పెట్రోల్‌ ధర లీటర్‌కు 180 బైసా (1.72), రెగ్యులర్‌ పెట్రోల్‌ ధర 170 బైసా, డీజిల్‌ 185 బైసాగాను నిర్ణయించారు. ఈ ధరలు గత మే నెలలో 161 బైసా (సూపర్‌ గ్రేడ్‌), 149 బైసా (రెగ్యులర్‌ పెట్రోల్‌), 166 బైసా (డీజిల్‌)గా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల పతనం నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కోసం గల్ఫ్‌ దేశాలతోపాటుగా ఒమన్‌ తమ దేశంలో ఆయిల్‌ ధరల్ని పెంచుతూ వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీస్‌ 900 మిలియన్‌ రియాల్స్‌గా ఉంది 2015లో. ఈ మొత్తం 2014లో 840 ఒమన్‌ రియాల్స్‌గా ఉంది. 2016లో 3.3 బిలియన్‌ ఒమని రియాల్స్‌ డెఫిషిట్‌ ఉండవచ్చని బడ్జెట్‌ అంచనాలు వేయడం జరిగింది. 2015లో ఈ డెఫిసిట్‌ 4.5 బిలియన్‌ డాలర్లు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావంతో జనవరిలో 1.6 బిలియన్‌ రియాల్స్‌ డెఫిసిట్‌ నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com