మానవీయ కోణంలో ఇద్దరు తల్లులకు జైలు శిక్ష రద్దు
- June 01, 2016
బహ్రెయిన్, ఇద్దరు తల్లుల జైలు శిక్షను రద్దు చేసింది. అంబుడ్స్‌మెన్ ఆఫీస్ రికమండేషన్స్‌తో జైనబ్ అల్ ఖావ్‌జా, అరినా బజ్‌తోవా అనే మహిళల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. యాక్టింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్, అబ్దుల్ రహ్మాన్ అల్ సయ్యెద్ చెబుతూ, అంబుడ్స్‌మెన్ కార్యాలయ సభ్యులు జైలును సందర్శించి, అక్కడ ఆ ఇద్దరు మహిళల పరిస్థితిని తెలుసుకున్నారు. అల్ ఖావ్‌జా 16 నెలల కుమారుడిని కలిగి ఉండగా, బజ్‌తోవా నాలుగేళ్ళ కుమారుడిని కలిగి ఉన్నారు. తమ పిల్లలతో వీరిద్దరూ జైల్లో ఉన్నారు. జైల్లో పిల్లలకు తగిన సౌకర్యాలు అందుతున్నప్పటికీ, వారి భవిష్యత్తుపై జైలు జీవితం తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోణంలో, వారిని విడుదల చేయాల్సిందిగా అంబుడ్స్‌మెన్ రికమెండేషన్ చేసింది. ఈ రికమండేషన్‌ని బేస్ చేసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయస్థానానికి పరిస్థితిని వివరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి, వారిపై ఉన్న శిక్షను రద్దు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







