ఫిబ్రవరి 8-24 వరకు బహ్రెయిన్ ఫుడ్ ఫెస్ట్
- February 07, 2024
బహ్రెయిన్: ఫిబ్రవరి 8-24 వరకు ‘బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ 2024 ’ 8వ ఎడిషన్‌ను నిర్వహించేందుకు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) సన్నాహాలు చేస్తోంది. స్థానిక మరియు అంతర్జాతీయ భాగస్వామ్యంతో మరాస్సీ బహ్రెయిన్, దియార్ ముహరక్లలో 100 రెస్టారెంట్లు, కేఫ్‌లలో ఈ ఫెస్టివల్ జరుగనుందని BTEA సీఈఓ సారా అహ్మద్ బుహెజ్జి వెల్లడించారు. 17 రోజుల పాటు జరిగే ఫెస్టివల్లో లైవ్ షోలతో సహా విభిన్న వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. మరాస్సీ బీచ్‌లోని ప్రధాన వేదికపై బహ్రెయిన్ కళాకారులు, స్థానిక బ్యాండ్లను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఇస్మాయిల్ దావాస్ బ్యాండ్, ది రావెన్స్, AQ జాజ్ ఎక్స్పీరియన్స్, DJ స్విఫ్, ఒరాకిల్ ప్రాజెక్ట్, రిలోకేటర్స్, ఫైవ్ స్టార్ వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ ఫెస్టివల్ బహ్రెయిన్ రుచులను జరుపుకునే విభిన్న శ్రేణి రుచికరమైన వంటకాలను అందించనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు వంట పోటీలను నిర్వహిస్తున్నామని.. గ్రేట్ ఐలాండ్ చెఫ్ 2024 అనేది 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం, లిటిల్ చెఫ్ 2024 12 -17 ఏళ్ల మధ్య ఉన్న వారి కోసం ఉంటుందన్నారు. బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఏడవ ఎడిషన్ భాగంగా 14 రోజులలో 168,000 మంది సందర్శకులు హాజరైనట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







