ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలపై సౌదీ కీలక ప్రకటన
- February 07, 2024
రియాద్: స్వతంత్ర పాలస్తీనా దేశం లేకుండా ఇజ్రాయెల్‌తో 'దౌత్య సంబంధాలు లేవు' అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. పాలస్తీనా సమస్యపై అమెరికాకు తన దృఢమైన వైఖరిని తెలియజేసింది. తూర్పు జెరూసలేంతో 1967 సరిహద్దుల్లో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించి, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ "దూకుడు" ఆగితే తప్ప ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉండవని సౌదీ అరేబియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క X ఖాతా ద్వారా కూడా ఈ ప్రకటనను విడుదల చేశారు. "అరబ్-ఇజ్రాయెల్ శాంతి ప్రక్రియపై సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య చర్చలు జరిగాయి. పాలస్తీనా సమస్యపై సౌదీ అరేబియా తన దృఢమైన వైఖరిని కలిగిఉంది. పాలస్తీనా ప్రజలు తమ చట్టబద్ధమైన హక్కులను పొందవలసిన ఆవశ్యకత ఉంది. " అని పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం వైట్ హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ..సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ సాధారణీకరణ చర్చలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కిర్బీ వ్యాఖ్యల నేపథ్యంలో పాలస్తీనా సమస్యపై వాషింగ్టన్‌కు తన దృఢమైన వైఖరిని తెలియజేస్తూ సౌద అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







