వాతావరణ హెచ్చరిక: రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు

- February 08, 2024 , by Maagulf
వాతావరణ హెచ్చరిక: రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు

యూఏఈ: రాబోయే వారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఆదివారం నుండి మంగళవారం వరకు ఎగువ వాయుగుండం క్రమంగా తీవ్రమవుతుందని, ఇది అక్కడక్కడా వర్షాలకు కారణం అవుతుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఇదే సమయంలో దుమ్ము, ఇసుక 15 - 25 వేగంతో గంటకు 45 కి.మీ.కు చేరుకుంటుందన్నారు. ఫిబ్రవరి 4న యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. జెబెల్ జైస్ పర్వతాలలో 3.4 ° C వద్ద గడ్డకట్టే స్థాయికి పడిపోయింది. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్‌లో శనివారం (ఫిబ్రవరి 3) ఉదయం 5 గంటలకు చలి 4.2ºC నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com