ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
- February 08, 2024
అమరావతి: తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డ సంగతి తెలిసిందే. తనకు చెడు చేయాలనే ఉద్దేశంతోనే భద్రతను కల్పించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలినైన తాను రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుందని… భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని తెలిపారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే… వారికి గన్ మెన్లను కేటాయిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







