స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులతో సహా ఐదుగురికి గాయాలు

- February 09, 2024 , by Maagulf
స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులతో సహా ఐదుగురికి గాయాలు

యూఏఈ: షార్జాలో గురువారం ఉదయం స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు సూపర్‌వైజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. షార్జా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు అకస్మాత్తుగా మలుపు తిరిగి, డ్రిఫ్‌మెంట్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత తమ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రైవేట్ పాఠశాల తల్లిదండ్రులకు పోలీసులు తెలిపారు. పాఠశాల బస్సులను జాగ్రత్తగా నడపాల‌ని, ట్రాఫిక్ నియమాలను పాటించాల‌ని సూచించారు. షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) గత సంవత్సరం 2,000 బస్సుల్లో కెమెరాలు మరియు భద్రతా పరికరాలను అమర్చింది. ఈ కెమెరాలు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు తిరిగి వెళ్లేటప్పుడు పర్యవేక్షించడానికి అనుమతిస్తాయి.  ఈ ఏడాది ప్రారంభంలో కొంతమంది బస్సు డ్రైవర్లు పర్మిట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారని దుబాయ్ యొక్క RTA వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com