ఫిబ్రవరి ఆరంభంలోనే దంచికొడుతున్న ఎండలు
- February 09, 2024
హైదరాబాద్: తెలంగాణ లో ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు ప్రజలు వామ్మో అంటున్నారు. ఏప్రిల్ లో ఎలాగైతే ఎండలు ఉంటాయో..ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం లోనే ఆ విధంగా ఉండడం తో ఏప్రిల్ , మే నెలలో ఇంకెలా ఉండబోతాయో అని ఖంగారుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం చాల చోట్లా 40 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే మరో నాలుగు రోజుల్లో మరింత తీవ్రమైన వేడి పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల్లో చూసుకుంటే గ్రేటర్ పరిధిలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లిహిల్స్‌లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3 చొప్పున ఉష్ణగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







