సినిమా రివ్యూ: ‘ఈగల్’.!

- February 09, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఈగల్’.!

ఈ మధ్య మాస్ రాజా సినిమాల పరిస్థితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో, ‘ఈగల్’ పైనా పెద్దగా అంచనాల్లేకుండా పోయాయ్. కానీ, ఏదో మూల రవితేజ ఫ్యాన్స్ యాంగిల్ నుంచి అయినా ఈ సినిమాపైనే ఆశలున్నాయ్. మరి, అంచనాల్లేకపోయినా.. కనీసం మాస్ రాజా తన ఫ్యాన్స్ ఆశలైనా నెరవేర్చాడా ‘ఈగల్’గా అంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో పత్తి ఫ్యాక్టరీని నడిపిస్తుంటాడు సహదేవ్ (రవితేజ). ఆ చుట్టు పక్కల వున్న గిరిజన రైతులు అక్కడ పండే అరుదైన పత్తిని అక్కడికి తీసుకొచ్చి నేయిస్తుంటారు. అయితే, అదే ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు పుష్కలంగా వున్నాయనీ, సహదేవ్ ఫ్యాక్టరీని, అక్కడి రైతుల్ని ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటూ ఓ బిజినెస్ మేన్ కూడా. మరి, చాలా సాత్వికంగా జీవనం సాగిస్తున్న సహదేవ్ నుంచి ఆ ఫ్యాక్టరీని తీసుకోవాలన్న కోరిక.. సహదేవ్ అండతో జీవనం సాగిస్తున్న అక్కడి రైతుల్ని ఖాళీ చేయించాలన్న వారి కోరిక నెరవేరిందా.? అసలు పైకి కనిపించే సహదేవ్‌కీ, జనం మాట్లాడుకునే ఆ భయంకరమైన ‘ఈగల్’కీ ఏంటి సంబంధం.? సహదేవ్ భార్య కావ్య (కావ్య థాపర్) ఏమైంది.? ఈ కథనంతటినీ నెరేట్ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుపమా పరమేశ్వరన్ నళినీ రావు (అనుపమ పరమేశ్వరన్) తన ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఏఏ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంది.? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే, ‘ఈగల్’ ధియేటర్‌లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
సహదేవ్‌గా, ఈగల్’గా రెండు రకాల డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో రవితేజ కనిపించారు. అయితే, రవితేజ గత చిత్రాలతో పోల్చితే.. ఈ రెండు పాత్రలూ కాస్త భిన్నంగా అనిపించాయ్. గతంలోని రవితేజను ఊహించుకుని వస్తే.. ఆ రవితేజ ఎక్కడా కనిపించడు.. అన్నంతగా ఈ సినిమాలో కొత్త రవితేజను చూపించాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంతవరకూ లేనంత స్టైలిష్ లుక్స్‌లోకి రవితేజని మార్చేశాడు కూడా. ఇక, అనుపమ పరమేశ్వరన్‌తోనే సినిమా కథ మొదలవుతుంది. కథ అనుపమ యాంగిల్ నుంచే స్టార్టవుతుంది. పర్‌ఫామెన్స్ విషయానికి వస్తే.. అనుపమ రేంజ్ కాదు కానీ, తనవరకూ తన పాత్రకు న్యాయం చేసింది. మరో హీరోయిన్ కావ్య థాపర్‌కి పెద్దగా స్కోప్ లేదు. రవితేజ భార్యగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపిస్తుందంతే. మరో కీలక పాత్ర నవదీప్.. చాలా కాలం తర్వాత మంచి రోల్ ఫుల్ లెంగ్త్ రోల్ దక్కించుకున్నాడు నవదీప్ ఈ సినిమాలో.  అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, మధుబాల, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ తదితరుల పాత్రలు చిన్నవే అయినా పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
కేజీఎఫ్ సినిమా మాదిరి ఈ సినిమాని టేకప్ చేశాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. హీరోకి అవసరమున్నా.. లేకున్నా భీభత్సమైన ఎలివేషన్లు.. పెద్దగా ట్విస్టులేమీ లేకున్నా సరే.. ఆయా సందర్భాల్లో ఎలివేషన్ల విషయంలో ఎక్కడా తగ్గలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేశాడు. పవర్‌ చూపిస్తూనే స్టైలిష్‌నీ మిస్ కాలేదు. అలాగే, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అటవీ ప్రాంతన్నీ పిక్చరైజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు ఎంగేజ్ చేస్తాయ్. కానీ, చాలా సన్నివేశాలు తేలిపోతాయ్. రవితేజకు పెద్దగా డైలాగులు లేకపోవడం మరో విశేషం కేవలం కళ్లతోనే ఆయన హావభావాల పర్‌ఫామెన్స్. నిర్మాణ విలువలు చాలా చాలా బాగున్నాయ్. మ్యూజిక్ విషయానికి వస్తే.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ‘ఆడు మచ్చ..’ అనే సాంగ్ జస్ట్ ఓకే. బట్ విజువలైజేషన్ బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో జాగ్రత్త చాలా అవసరమనిపించింది.

ప్లస్ పాయింట్స్.!
రవితేజ న్యూ ట్రాన్స్ ‌ఫామేషన్, ఆధ్యంతం ఆకట్టుకున్న విజువల్స్, రెగ్యులర్ కమర్షియల్ చిత్రానికి భిన్నంగా ఇంకేదో ట్రై చేయాలన్న డైరెక్టర్ ఆలోచన..

మైనస్ పాయింట్స్..!
హీరో పాత్రకు ఇతర పాత్రలు ఇచ్చిన బిల్డప్స్ ఓవరాక్షన్ చేసినట్లనిపిస్తాయ్.. వాస్తవంగా చెప్పాలంటే.. సహదేవ్ పాత్ర కొత్తగా వుంటుంది కానీ, ‘ఈగల్’ పాత్రకు అంత సీను లేదనిపిస్తుంది చూస్తున్న ప్రేక్షకుడికి.

చివరిగా.!
‘ఈగల్’ జస్ట్ ఏ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఎంటర్‌టైన్‌మెంట్ రవితేజ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ తప్పదు సుమా.!

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com