విమానం లో దాక్కొని దుబాయ్ పారిపోయిన చైనా కుర్రోడు

- June 01, 2016 , by Maagulf
విమానం లో దాక్కొని దుబాయ్ పారిపోయిన చైనా కుర్రోడు

చైనాకు చెందిన ఓ యువకుడు ఎమిరేట్స్ కార్గో విమానంలో దాక్కున్నాడు. దీంతో అతడు దాదాపు తొమ్మిదిగంటలపాటు అందులోని ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో విమానం షాంఘై నుంచి దుబాయ్ కు చేరుకుంది. ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం చైనాకు చెందిన స్టోవావే అనే పదహారేళ్ల బాలుడు కార్గో విమానంలో దాచుకున్నట్లు విమానం దుబాయ్ చేరుకున్నాక తెలిసింది. దుబాయ్ లో జీవితం చాలా బాగా ఉంటుందని తాను కొంతమంది ద్వారా విన్నానని, డబ్బు సంపాధించడానికి దుబాయ్ చాలా అనుకూల నగరం అని తెలిసిందని, అందుకే తాను దుబాయ్ రావాలని నిర్ణయించుకున్నట్లు ఆ బాలుడు తెలిపాడు.కార్గో విమానంలోని బ్యాగ్స్ సెక్షన్ లో తనకు హాయిగా ఉందని అందుకే అందులోనే తల దాచుకున్నాని చెప్పాడు.
ఈ బాలుడికి దుబాయ్ భాష రాకపోవడంతో చైనాకు చెందిన ఓ ట్రాన్స్ లేటర్ ద్వారా అతడు చెప్పే దానిని అర్థం చేసుకున్నారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలుడు వాయవ్య నైరుతి చైనాలోని బెజాంగ్ అనే ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అడుక్కునే వారు సైతం దుబాయ్ లో కుప్పలుగా డబ్బు సంపాధించవచ్చని అతడు ఆన్ లైన్ ద్వారా విన్నాడని తెలుసుకున్నారు. అయితే, అసలు విమానంలోకి ఎలా వచ్చాడనే విషయం మాత్రం గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఆ బాలుడు గల్ఫ్ ఎమిరేట్స్ అధికారులు అదుపులో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com