మెట్రో స్టేషన్ -అల్ మమ్జార్ బీచ్‌ మధ్య కొత్త బస్సు మార్గం..పలు రూట్స్ అప్డేట్

- February 09, 2024 , by Maagulf
మెట్రో స్టేషన్ -అల్ మమ్జార్ బీచ్‌ మధ్య కొత్త బస్సు మార్గం..పలు రూట్స్ అప్డేట్

దుబాయ్: అల్ మమ్జార్ బీచ్‌కి వెళ్లేవారి సౌకర్యార్థం ఫిబ్రవరి 9 నుండి కొత్త వీకెండ్ బస్సు మార్గం W20 కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రకటించింది. రూట్ W20 శుక్రవారం నుండి ఆదివారం వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11గంటల మధ్య నడుస్తుంది. స్టేడియం మెట్రో స్టేషన్‌- అల్ మమ్జార్ బీచ్‌ల మధ్య అరగంటకు ఓ బస్సు అందుబాబులో ఉంటుంది.  

బస్ రూట్స్ అప్డేట్

బస్సు ప్రయాణికుల కోసం రూట్ 11B పేరును రూట్ 11గా మార్చారు. రూట్‌లు 16A మరియు 16B రీరూట్ చేసారు. వరుసగా రూట్‌లు 16 మరియు 25గా పేరు మార్చారు. రూట్ 16 అల్ రష్దియా బస్ స్టేషన్ నుండి ప్రారంభమై అల్ అవీర్‌కు వెళుతుంది. అయితే రూట్ 25 గోల్డ్ సౌక్ బస్ స్టేషన్ నుండి అల్ రష్దియా గమ్యస్థానంగా ప్రారంభమవుతుంది. ప్రయాణీకులకు రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొన్ని బస్సు మార్గాల కోసం మరిన్ని మార్పులు చేయబడ్డాయని ఆర్టీఏ వెల్లడించింది. రూట్ F62 దుబాయ్ ఫెస్టివల్ సిటీ, అల్ గర్హౌద్ పరిసర ప్రాంతాలకు విస్తరించారు. రూట్ C04 మహ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ పరిసర ప్రాంతాలకు, రూట్ 103 మరియు 106 ప్రధాన స్టేషన్ల నుండి గ్లోబల్ విలేజ్‌కు నేరుగా, నాన్‌స్టాప్ సేవలను అందిస్తాయి. రూట్ E303 అల్ ఇత్తిహాద్ స్ట్రీట్ మీదుగా షార్జాకు మళ్లించారు. అదే తేదీ నుండి, 16A, 16B, 64A మార్గాలు నిలిపివేయబడతాయి. అదే సమయంలో ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ 5, 7, 62, 81, 110, C04, C09, E306, E307A, F12, F15, F26 మరియు SH1 బస్ రూట్‌ల కోసం ప్రయాణ సమయాల్లో మార్పులు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com