రామ్ చరణ్‌కి విలన్‌గా ఆ బాలీవుడ్ నటుడు ఫిక్సయినట్లేనా.?

- February 10, 2024 , by Maagulf
రామ్ చరణ్‌కి విలన్‌గా ఆ బాలీవుడ్ నటుడు ఫిక్సయినట్లేనా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. హీరోయిన్‌గా మొదట రషా తదానీ అనుకున్నారు.

ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు, జాన్ అబ్రహం.

జాన్ అబ్రహాం ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఆయనతో బుచ్చిబాబు అండ్ టీమ్ మంతనాలు జరిపారట. జాన్ అబ్రహాం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు సిద్ధంగానే వున్నాడనీ తెలుస్తోంది.

త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తి కాగానే బుచ్చిబాబు సన సినిమా స్టార్ట్ చేసేస్తాడట. లేదంటే.. ఆ సినిమా సెట్స్‌పై వుండగానే ఈ సినిమా కూడా పట్టాలెక్కించేస్తాడని కూడా అంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com