కలబందతో డయాబెటిక్ పేషెంట్లకు అది సాధ్యమేనా.?

- February 10, 2024 , by Maagulf
కలబందతో డయాబెటిక్ పేషెంట్లకు అది సాధ్యమేనా.?

కలబందను నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్‌గా అభివర్ణిస్తుంటారు. అలాగే, పలు రకాల మెడిసెన్స్‌లోనూ కలబందను విరివిగా వాడుతుంటారు.

అయితే, తాజాగా డయాబెటిక్ పేషెంట్లకు కలబంద ఓ  వరంగా చెబుతున్నారు. తాజా అధ్యయనాల్లో వెల్లడైన విషయమేంటంటే, షుగర్ వ్యాధిగ్రస్తులకు దెబ్బలు తగిలినా.. ఒంటి మీద ఎక్కడ పుండు ఏర్పడినా తొందరగా తగ్గదు.

కానీ, కలబందతో ఆయా దెబ్బలకు, పుండ్లకు చెక్ పెట్టొచ్చని తేలింది. కేవలం డయాబెటిక్ పేషెంట్ల పైనే ఈ ప్రయోగం చేశారట. దాదాపు 90 శాతం మంచి ఫలితం వచ్చిందని సర్వేలు చెబుతున్నాయ్.

సో, ఇకపై డయాబెటిక్ పేషెంట్లు దీర్ఘకాలిక పుండుతో బాధపడే అవకాశం లేదనే చెప్పొచ్చేమో. అలాగే, డయాబెటిక్ పేషెంట్లకు అనుకోకుండా ఏమైనా గాయాలైనా వాటిని మాన్చే శక్తి కలబందకు వున్నట్లు తేలింది.

త్వరలోనే మరింత ప్రయోగాత్మకంగా కలబందతో కూడిన మెడిసెన్‌ని డయాబెటిక్ పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురానున్నారనీ తెలుస్తోంది. సో, డయాబెటిక్ పేషెంట్లు కాని గాయాలతో ఆయా అవయవాలను తొలగించుకోవాల్సిన అవసరం ఇకపై తగ్గే అవకాశాలున్నాయన్న మాట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com