నాగార్జునకి జోడీ ఆ సీనియర్ నటి.?
- February 12, 2024సీనియర్ హీరోయిన్లు ఓ వైపు యంగ్ హీరోయిన్లతో జోడీ కడుతూనే మరోవైపు సీనియర్ హీరోయిన్లతోనూ జోడీ కడుతున్నారు. అందులో మొదటి లిస్టులో వుంటాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కోసం ఒకేసారి సీనియర్ నటి రమ్యకృష్ణతోనూ, అలాగే యంగ్ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠితోనూ ఈక్వెల్‌గా రొమాన్స్ పండించేశారాయన.
ఇప్పుడు నాగార్జున హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్గా సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో హిట్టు కొట్టాడు. అదే స్పీడుతో శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.
తాజాగా కొత్త దర్శకుడు సుబ్బుతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ సీనియర్ నటిని పరిశీలిస్తున్నారట. ప్రియమణి పేరును నాగార్జున ప్రిఫర్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ‘రగడ’ సినిమా కోసం ప్రియమణి, నాగార్జున స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట తెరపై సందడి చేయబోతోందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావల్సి వుంది. కానీ, ఇదో సీరియస్ కోర్డు డ్రామా కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా అనీ, హీరోయిన్ పాత్రకు హీరోతో పాటూ, ఈక్వెల్ ఇంపార్టెన్స్ వుండబోతోందనీ, ప్రియమణి వంటి సహజ నటికి ఆ స్థానాన్నిస్తే బావువుంటుందని నాగార్జున సూచిస్తున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు