‘ఈగల్’కి హరీష్ శంకర్ సపోర్ట్.!

- February 12, 2024 , by Maagulf
‘ఈగల్’కి హరీష్ శంకర్ సపోర్ట్.!

మాస్ రాజా హీరోగా ఇటీవలే ‘ఈగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మిక్స్‌డ్ టాక్‌తో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేస్తోంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అని పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని తెరకెక్కించాడు.
ఈ మధ్య మాస్ రాజా సినిమాల రిజల్ట్‌ని బట్టి.. ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవ్. దాంతో, సినిమాకి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూసింత ఎక్కువే రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఆ ఆనందంతోనే.. వెరీ లేటెస్ట్‌గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్‌కి విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్, సినిమా గురించీ, దర్శకుడి గురించి నాలుగు ముక్కలు గొప్పగా చెప్పి.. సినిమాకి సపోర్ట్‌గా నిలిచాడు.
సినిమాలో లవ్ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదన్నఓ వర్గం ప్రేక్షకుల అభిప్రాయాల్ని హరీష్ శంకర్ తప్పు పట్టారు. ఇదో సీరియస్ యాక్షన్ మూవీ.. దీనిలో లవ్ యాంగిల్ ఎంత వుండాలో అంతే వుంచాడు డైరెక్టర్.. అంతేకాదు, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇచ్చి సినిమా స్థాయిని మరింత పెంచాడు.. అని వ్యాఖ్యానించాడు.
అలాగే, తనపై సెటైర్లు వేసిన వారికీ తర స్టైల్‌లో ఎప్పటిలాగే చురకలు అంటించేశాడు హరీష్ శంకర్. అన్నట్లు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో ప్రస్తుతం సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com