సౌదీలో ట్రాఫిక్ పరిష్కారాల కోసం 'కంజెషన్ హ్యాకథాన్'
- February 15, 2024
రియాద్: ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ "కంజషన్ హ్యాకథాన్"ని ఆవిష్కరించింది. ట్రాఫిక్ రద్దీకి వినూత్న పరిష్కారాలను గుర్తించడం ద్వారా స్మార్ట్ నగరాల అభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. రియాద్‌లో మంగళవారం "మెరుగైన జీవితం" అనే థీమ్‌తో జరిగిన వరల్డ్ ఫోరమ్ ఫర్ స్మార్ట్ సిటీస్ సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) నిర్వహించింది. స్థానిక మరియు ప్రపంచ స్థాయిలో రవాణా రంగాన్ని మెరుగుపరచాలనే అభిరుచితో సాంకేతిక విద్యార్థులు, ప్రోగ్రామర్లు మరియు ఏఐ ఇంజనీర్లను ఆకర్షించడానికి హ్యాకథాన్ రూపొందించారు. ఈ కార్యక్రమానికి SDAIA మద్దతు ఇచ్చింది. మునిసిపాలిటీలు, గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రిత్వ శాఖ, రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ మరియు రియాద్ రీజియన్ మునిసిపాలిటీతో భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









