తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
- February 16, 2024
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామి వారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. దాదాపు 7 టన్నుల పుష్పాలను, 50 వేల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహనసేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







