విద్యలో అంతర్జాతీయ ప్రమాణాల కోసమే ఎడెక్స్‌తో ఒప్పందం: సిఎం జగన్
- February 16, 2024
అమరావతి: విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అన్నారు.
నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారు.. ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం.. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి.. మంచి మంచి జీతాలు సంపాదించాలి.. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అన్నారు.
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి అన్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టచ్చు. అందుకనే ప్రతి అడుగులోనూ కూడా చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం అని వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం.. గ్లోబల్ సిటిజన్ కావాలంటే మన మాట్లాడే భాషలో మార్పులు రావాలి.. ప్రపంచస్థాయితో పోటీపడాలి.. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు అన్నారు. అందుకనే ఇంగ్లీషు మీడియం నుంచి నాడు-నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది.. అక్కడితో మనం ఆగిపోలేదు .. వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యా ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు.
కాగా, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.. నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం , ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ”ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదిరింది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్ , రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







