సౌదీలో 14 మంది తీవ్రవాదులకు ఉరిశిక్ష

- June 02, 2016 , by Maagulf
సౌదీలో 14 మంది తీవ్రవాదులకు ఉరిశిక్ష



సౌదీ అరేబియాలో 14 మంది వ్యక్తులకు తీవ్రవాదంతో సంబంధాలున్నాయన్న కారణంగా ఉరిశిక్ష విధించారు. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లోని ఖాతిఫ్‌లో పోలీసులపై వీరు దాడి చేశారు. మరో 9 మందికి ఈ కేసులో 3 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించబడింది. 2011-14 మధ్య జరిగిన నిరసనల్లో 20 మంది ఆందోళనకారులు మరియు పలువురు పోలీసు అధికారులు మృతి చెందారు. జనవరి 2న సౌదీ అరేబియా నలుగురు ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ యాక్టివిస్టుల్ని ఎగ్జిక్యూట్‌ చేసింది. సౌదీ అరేబియా తమ జ్యుడీషియరీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. సున్నీ, షియాతీస్‌ అనే బేధభావం ఎక్కడా చూపబోమని, రాజకీయ కారణాలతో కొందరు కుట్రపూరితంగా ప్రజల్ని రెచ్చగొట్టి విధ్వంసాలకు దిగడం ద్వారా సామాన్యుల్ని, అలాగే భద్రతా సిబ్బందిని హతమార్చడం హేయమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com