సైబర్ ఫ్రాడ్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

- February 18, 2024 , by Maagulf
సైబర్ ఫ్రాడ్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్: మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు ధృవీకరించింది. నిందితుడు వ్యక్తిగత సమాచారం అప్డేట్ పేరుతో ఒక వ్యక్తిని BD1,000 మోసగించాడు. బాధితుడికి ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా తమ బ్యాంకింగ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని అభ్యర్థిస్తూ మెసేజ్ పంపాడని,  లింక్‌ను తెరిచిన తర్వాత బాధితుడు తన బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేశాడు.  కొద్దిసేపటి తర్వాత బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుండి BD1,000 విత్‌డ్రావల్ నోటిఫికేషన్‌ను అందుకున్నాడు. విచారణలో ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ట్రాక్ చేయడంతో నిందితుడి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com