బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్..
- February 18, 2024
మలేషియా: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత జట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
భారత బ్యాడ్మింటన్ స్టార్‌లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్‌ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్‌లాండ్‌లను ఓడించి కప్పును గెలుచుకుంది.
పైనల్స్‌లో మొదటగా సుపనిందా కతేథాంగ్‌ను 21-12, 21-12 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16తో కిటితారాకుల్-రవింద్ర ప్ర జోంగ్‌జాయ్ పై విజయం సాధించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







