పాలస్తీనా విదేశాంగ మంత్రితో మంత్రి జైశంకర్ భేటీ
- February 19, 2024
మ్యూనిచ్: పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ‘పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాం’ అని మంత్రి తెలిపారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సు నేపథ్యంలో జైశంకర్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ పట్టణంలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ – పాలస్తీనా సమస్య పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని భారత్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







