బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జూన్ వరకు పొడిగింపు
- February 19, 2024
న్యూ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ (BJP) హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2024 జూన్ వర కూ పొడిగించింది. 2020లో అమిత్ నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలను నడ్డా తీసుకున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడి గించాలనే ప్రతిపాదన గత జనవరిలో అమితా చేయగా, దీనికి బీజేపీ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు ఉంటుంది. అయితే, ఆ తర్వాత దానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. జేపీ నడ్డా అధ్యక్షుడిగా బీజేపీ పలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో పార్టీని ఆయన విజయ తీరాల కు చేర్చారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాల రెండోరోజైన ఆదివారం నాడు నడ్డా పదవీ కాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వేలాది మంది పార్టీ కార్య కర్తలు, అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ప్రచార అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు







