లాస్ ఏంజిల్స్‌లో 'మెగాస్టార్' చిరంజీవికి ఘన సన్మానం!
- February 19, 2024
అమెరికా: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా ఘనంగా సన్మానించారు.
అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో ‘పద్మ విభూషణ్’ గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి.. శాలువాలతో చిరుకి తెలుగు ఫాన్స్, మెగా ఫాన్స్ సన్మానం చేశారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. తనపై కురిపిస్తున్న ఈ ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







