తిరుమల శ్రీవారి ‘మే’ నెల టికెట్లు విడుదల
- February 19, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను సోమవారం టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. బుధవారం పది గంటల వరకు సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టిటిడి అధికారులు తెలిపారు.లక్కీడిప్ పొందినవారు అదే రోజు మధ్యాహ్నాం 12 గంటలలోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని వెల్లడించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను 22వ తేదీ ఉదయం పది గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటా 23న ఉదయం పది గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను 24న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







