రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు అవార్డులు..
- June 02, 2016
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్జీవో-1, సోషల్ వర్క్-1, రైతులు-3, అంగన్వాడీ వర్కర్స్-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







