వరుణ్ తేజ్ కోసం ఇక్కడ మెగా పవర్ స్టార్..అక్కడ ఖాన్ బాబా.!
- February 19, 2024
మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ వివాహానంతరం వస్తున్న సినిమా ‘ఆపరేషన్ వాలైంటైన్’. ప్రత్యేకమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఇప్పటి వరకూ రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.
ఆసక్తికరంగానే ప్రోమోలున్నాయన్న పబ్లిక్ రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ మరింత అలర్ట్ అయ్యింది. సినిమాని ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోన్న ఈ సినిమాకి తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారు.
రేపు అనగా 20 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ని రామ్ చరణ్ రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









