ఇంటర్ నెట్ కోసం ఇతరుల వైఫై వాడితే వాడితే కఠిన చర్యలు..
- June 02, 2016
ఇంటర్ నెట్ కోసం ఇతరుల వైఫై(వైర్ లెస్ ఫెడిలిటీ)ని వారి అనుమతి లేకుండా వాడితే చోరీగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియాలో ఫత్వా జారీ చేశారు. వైఫై వాడకాన్ని చోరీగా పరిగణించాలని ఫత్వాలో అధికారులు పేర్కొన్నారు. సౌదీ అరేబియా రాజుకు సలహాలిచ్చే అధికారి అలీ అల్ హకామీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.వైఫై వాడాలనుకుంటే ఆయా వ్యక్తుల పర్మిషన్ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హై స్కాలర్స్ కమిషన్ సభ్యుడు వెల్లడించారు. పార్కులు, ప్రైవేట్ షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ కార్యాలయాలలో పాస్ వర్డ్ లేకుండా ఉన్న వైఫై సౌకర్యాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునని, అలాంటి సందర్భాలలో ఇది నేరం కింద పరిగణించమని స్పష్టం చేశారు.ఇతర దేశాలలో ప్రభుత్వ నియమాలు, చట్టాలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం ఫత్వా అంటే చట్టంతో సమానం. గతంలో కూడా మహిళలు ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడటం, వారు కుర్చీలలో కూర్చోవటం, కొన్ని రకాల పండ్లను తినరాదని, ఏ వ్యక్తి కూడా మార్స్ మీదకు వెల్లకూడదని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫత్వాలు జారీ అయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







