ఒమన్‌లో 27 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- February 21, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 2022 చివరి నాటికి OMR27.13 బిలియన్లకు చేరుకున్నాయి. 2021లో OMR25.08 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన ప్రాథమిక డేటా ప్రకారం.. ఈ కీలక పెట్టుబడి ప్రవాహం ప్రస్తుత ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో 4.8 శాతంగా ఉంది. 2022 చివరి నాటికి మొత్తం విదేశీ పెట్టుబడిలో ఎఫ్‌డిఐ 75.9 శాతంగా ఉంది. అత్యధికంగా చమురు మరియు గ్యాస్ సెక్టర్ OMR15.32 బిలియన్ల విలువ కలిగిన మొత్తం విదేశీ పెట్టుబడిలో 56.4 శాతం విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. పరిశ్రమలు OMR2.37 బిలియన్లు, రియల్ ఎస్టేట్, లీజింగ్ మరియు వాణిజ్య ప్రాజెక్టుల కార్యకలాపాలలో OMR1.11 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు పెట్టిన వాటిల్లో యునైటెడ్ కింగ్డమ్ OMR9.62 బిలియన్లను అందించగా.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా OMR3.68 బిలియన్, చైనా OMR1.03 బిలియన్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







