భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..
- February 21, 2024
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలేకపోయారు. భారత్-చైనా మధ్య 21వ కార్ఫ్స్ కమాండర్‌స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్-మోల్డో బోర్డర్‌లో మీటింగ్ పాయింట్‌లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలను ఉపసంహరించుకోవడంపై గత పర్యటనల్లో జరిగిన చర్చలు భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతికి ముఖ్యమైన ప్రాతిపదిక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చర్చల సందర్భంగా ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పరస్పరం స్నేహపూర్వకంగా ముందుంచాయని తెలిపింది. మధ్యంతర కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







