సినీ సామాజికవేత్త విజయ్ వర్మ పాకలపాటి కి విశ్వగురు సేవా పురస్కారం
- February 22, 2024
విజయవాడ: సినీ నిర్మాతగా దర్శకునిగా మరియు వివిధ సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర దేశ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొందిన వీస్ విజయ్ వర్మ పాకలపాటికి మరో అత్యున్నత పురస్కారం లభించింది.ప్రతిష్టాత్మక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ గ్రామ స్థాయినుండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనవంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ్ వర్మ పాకలపాటి ని విశ్వగురు సేవా పురస్కారంతో సత్కరించింది.హైకోర్టు జడ్జి వేణుగోపాల్ ఈ పురస్కారాన్ని అందించి విజయ్ వర్మను అభినందించారు.సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ లక్ష్మికాంత్ లు విజయ్ వర్మ అందిస్తున్న తనవంతు సేవలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు.అవార్డు గ్రహీత విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ...సినీ నటులు బ్రహ్మానందం, సినీ నటులు ఆదిత్య ఓం,నారీసేన వ్యవస్థాపకురాలు లతా బోట్ల, రోటరీ సంస్థ, షిర్డీ సాయి సంస్థాన్ యూ.ఎస్.ఏ, రోటేరియన్ సురేన్ వంటి ఎందరో ప్రముఖుల సహకారంతోనే కొన్ని కార్యక్రమాలు చెయ్యగలిగానని , భవిష్యత్ లో దేశ అంతర్జాతీయ సేవా సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవలు అందించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









