ఐపీఎల్ షెడ్యూల్ అవుట్..!
- February 22, 2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది.
ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుతో చెన్నై తలపడనుంది. మొదట 21 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. చెన్నై జట్టు తొలి మ్యాచ్‌ని తొమ్మిదోసారి ఆడనుంది. ఇంతకుముందు, జట్టు 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 ,2023లో ప్రారంభ మ్యాచ్‌ను ఆడింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది, ఆ తర్వాత వెంటనే ఐపీఎల్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేయడానికి సమయం పడుతుంది. ఈ కారణంగానే ఢిల్లీ తొలి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగనున్నాయి. దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. 15 రోజుల షెడ్యూల్ మాత్రమే బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల కానుంది.
మొత్తం టోర్నీ భారత్‌లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. 2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో (దక్షిణాఫ్రికా) ఆడగా, 2014లో సాధారణ ఎన్నికల కారణంగా యూఏఈలో కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. అయితే, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్‌లోనే నిర్వహించారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న దృష్ట్యా, ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







